ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-05-18T06:10:34+05:30

మండలంలోని నాగిరెడ్డిపల్లి సమీపంలో గల సెయింట్‌ జేవియర్స్‌ ఆసుపత్రిలో గల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ 

వినుకొండ టౌన్‌, మే 17  మండలంలోని నాగిరెడ్డిపల్లి సమీపంలో గల సెయింట్‌ జేవియర్స్‌ ఆసుపత్రిలో గల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సూచనలు మేరకు డీఎస్పీ విజయ్‌భాస్కర్‌తో కలిసి ఆమె కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సోమవారం పరిశీలించారు. బాధితులకు చేస్తున్న పలు వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సువిశాలమైన రూమ్‌లు, మంచి వాతావరణం ఉందని, కొవిడ్‌ బారిన పడిన ప్రజలు నివాస గృహాల్లో ఇబ్బంది పడుతున్నట్లయితే వారంతా ఈ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు వచ్చే ఆహార పదార్థాల్లో నాణ్యత పెంచాలని, ప్రభుత్వాసుపత్రిలో ఉన్న బాధితులకు  సైతం ఆహారం సరఫరా చేయాలని, కొవిడ్‌కేర్‌ సెంటర్‌ వద్ద అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించి అందిస్తున్న వైద్యసేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ జానీబాషా, వార్డు సచివాలయ సిబ్బంది, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-18T06:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising