ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు మృతి

ABN, First Publish Date - 2021-03-03T05:41:28+05:30

మండలంలోని వైకుంఠపురంలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం ఉదయం సమీపంలోని కృష్ణానదిలో నీటిపై తేలియాడుతూ కనిపించాయి.

కుమారుడు మృతదేహం వద్ద విలపిస్తున్న నాగసాయి తల్లి నాగలక్ష్మి, నాగసాయి, గోవర్ధన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణానదిలో మృతదేహాలు లభ్యం

అమరావతి, మార్చి 2: మండలంలోని వైకుంఠపురంలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం ఉదయం సమీపంలోని కృష్ణానదిలో నీటిపై తేలియాడుతూ కనిపించాయి. స్థానిక జాలర్లు వీటిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు.  ఆదివారం మద్యాహ్నం స్థానిక పాఠశాలలో ఆటలు ఆడుకున్న కె.వెంకటనాగసాయి(14), పి.గోవర్ధన్‌(9) స్నానం చేసేందుకు ఘాట్‌ల వైపు వెళ్లారు.  ఇద్దరూ నదిలో దిగి నీటి ప్రవాహానికి గల్లంతై ఉంటారని స్థానికులు చెపుతున్నారు. తమ పిల్లలు ఎక్కడికైనా వెళ్లి ఉంటారని, తప్పక వస్తారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి మరణవార్తతో కుప్పకూలి శోకసంద్రంలో మునిగిపోయారు. నాగసాయి తుళ్లూరులో జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి, గోవర్ధన్‌ వైకుంఠపురంలోని యూపీ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ విజయకృష్ణ, ఎస్‌ఐ కోటేశ్వరరావులు  ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను నీటిలోనుండి నది ఒడ్డుకు చేర్పించారు. ప్రభుత్వ వైద్యశాలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.   


Updated Date - 2021-03-03T05:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising