ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాప్‌-32కు చేరుకున్న స్నూకర్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-04-01T05:46:08+05:30

ఎల్‌వీఆర్‌ క్లబ్‌, రీడింగ్‌ రూం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏపీ స్టేట్‌ స్నూకర్‌ పోటీలు టాప్‌-32కు చేరుకున్నాయి.

పోటీలలో పాల్గొన్న కాకినాడ క్రీడాకారుడు జె.శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (క్రీడలు), మార్చి31: ఎల్‌వీఆర్‌ క్లబ్‌, రీడింగ్‌ రూం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏపీ స్టేట్‌ స్నూకర్‌ పోటీలు టాప్‌-32కు చేరుకున్నాయి. బుధవారం వరకు జరిగిన పోటీలలో గెలుపొందిన 24 మంది, గత ఏడాది టాప్‌ 8లో నిలిచిన క్రీడాకారులు మొత్తం కలసి టాప్‌-32కు చేరుకున్నారు. ఈ సందర్భంగా  టోర్నమెంట్‌ ఇన్‌చార్జి పురుషోత్తం మాట్లాడుతూ ఈ 32 మందిని 8 గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపులో నలుగురు క్రీడాకారులతో రౌండ్‌రాబిన్‌  పద్ధతిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ 8 గ్రూపుల నుంచి గ్రూపునకు ఇద్దరు చొప్పున మొత్తం 16మంది క్రీడాకారులు ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి నాకౌట్‌ పద్ధతిలో పోటీలు జరుగుతాయని, అలాగే గురువారం నుంచి  బిలియర్డ్స్‌ పోటీలు కూడా ప్రారంభమవుతాయన్నారు.  క్రీడాకారులు కొవిడ్‌ నిబంధనలను తప్పనసరిగా పాటించాలని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-04-01T05:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising