ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2021-11-18T18:18:03+05:30

రాజధాని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎదురుదెబ్బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగరడం గమనార్హం. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే జరగ్గా.. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది.


ఊహించని షాక్..

రాజధాని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గంలో (తాడికొండ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా.. ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాగా.. రాజధాని నియోజకవర్గంలో రెండు స్దానాల ఓటమితో వైసీపీ డీలాపడినట్లయ్యింది. ఈ ఓటమితో వైసీపీ పెద్దల నుంచి శ్రీదేవికి పెద్ద ఎత్తున ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఓటమిపై శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు టీడీపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Updated Date - 2021-11-18T18:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising