ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినిపై కరస్పాండెంట్‌ అసభ్యప్రవర్తన

ABN, First Publish Date - 2021-10-19T05:46:44+05:30

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఓ విద్యార్థినిపై వక్రబుద్ధితో ప్రవర్తిస్తూ అసభ్యకరంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువుల దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.

పాఠశాల కరస్పాండెంట్‌ శివారెడ్డి( వయెలెట్‌ షర్టు వేసుకున్న వ్యక్తి)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేహశుద్ధి చేసి పోలీసుస్టేషనలో అప్పగింత

పిడుగురాళ్ల, అక్టోబరు 18: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఓ విద్యార్థినిపై వక్రబుద్ధితో ప్రవర్తిస్తూ అసభ్యకరంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువుల దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన బాలిక కొన్నేళ్లుగా జానపాడు రోడ్డులోని భానోదయ స్కూల్లో చదువుతోంది. పాఠశాల కరస్పాండెంట్‌ శివారెడ్డి ఆ బాలికను అప్పుడప్పుడు ‘నా కూతురులాంటిదానివంటూ’నే దగ్గరకు తీసుకుంటూ ముద్దులు పెట్టుకోవటంతోపాటు అసభ్యకరమైనమాటలు అంటుండేవాడని, దసరాసెలవులకు ముందు కూడా ఇదే రీతిలో ప్రవర్తించాడు. సెలవుల అనంతరం సోమవారం పాఠశాలకు వెళ్లబోనని బాలిక మొండికేయడంతో విషయం తెలియక తల్లిదండ్రులు మందలించారు. అయినా వెళ్లనని,  జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు వెళ్లి శివారెడ్డిని నిలదీయటంతోపాటు కొందరు బంధువులు కోపోద్రిక్తులై దేహశుద్ధి చేసి పోలీసుస్టేషనలో అప్పగించారు. 

పోక్సో చట్టం కేసు నమోదు 

బాధిత బాలిక, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాల కరస్పాండెంట్‌ శివారెడ్డిపై పోక్సో చట్టంతోపాటు బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ కె.ప్రభాకరరావు తెలిపారు. 


Updated Date - 2021-10-19T05:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising