ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీసం బ్లీచింగ్‌కు డబ్బుల్లేవ్‌..

ABN, First Publish Date - 2021-12-02T05:58:10+05:30

నిధులు లేకపోవడంతో గ్రామాల్లో మురుగు తీయడానికి, కనీసం బ్లీచింగ్‌ చల్లించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌లు ప్రజాప్రతినిధులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదుకు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాప్రతినిధులు వద్ద సర్పంచ్‌ల ఆవేదన

గుంటూరు(తూర్పు), డిసెంబరు 1: నిధులు లేకపోవడంతో గ్రామాల్లో మురుగు తీయడానికి, కనీసం బ్లీచింగ్‌ చల్లించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌లు ప్రజాప్రతినిధులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎమ్యెల్యేలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, కిలారు రోశయ్య, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డొక్కా మాణిక్య వరప్రసాదును గుంటూరులోని వారి నివాసాల్లో కలసి వినతిపత్రాలు అందజేశారు. పంచాయితీ సర్పంచ్‌లకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి జమచేయాలని సర్పంచ్‌లు కోరారు. వినతిపత్రాలు అందజేసినవారిలో సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, రాష్ట్ర పంచాయతీ పరిషత్‌ చైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు, సర్పంచ్‌లు పి.నాగమణి, టి.కృష్ణమోహన్‌, చందు వెంకట సాంబశివరావు, శ్రీనివాసరావు, డి.రాము, తోకల సరోజిని, నరసింహారావు, ఎన్‌.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-12-02T05:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising