ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుగు ప్రయాణాలకు.. చార్జీల రెట్టింపు

ABN, First Publish Date - 2021-01-17T05:39:34+05:30

సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చి తిరుగుప్రయాణమైన వారికి రెట్టింపు చార్జీలు భారంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణికులపై అదనపు భారం

రవాణాశాఖ చర్యలు శూన్యం  


గుంటూరు, జనవరి 16: సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చి తిరుగుప్రయాణమైన వారికి రెట్టింపు చార్జీలు భారంగా మారాయి. సాధారణంగా ఆర్టీసీ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు (అమరావతి ఏసీ) రూ.740, బెం గళూరుకు ఇంద్ర ఏసీ రూ.1,170, చెన్నైకు ఇంద్ర ఏసీ రూ.790 చార్జీ వసూలు చేసేవారు. పండుగ స్పెషల్‌ సర్వీసుల పేరుతో చార్జీలో 50శాతం మేర ఆర్టీసీ అద నంగా వసూలు చేస్తోంది. సంక్రాంతి రద్దీని క్యాష్‌ చేసు కొనేందుకు కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ చార్జీల దోపిడీ చేస్తున్నాయి. తిరుగు ప్రయాణంలో 16, 17వ తేదీల్లో హైదరాబాద్‌కు రూ.1,200 పైనే వసూలు చేస్తున్నారు. స్లీపర్‌ సీటింగ్‌కు రూ.1500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తు న్నారని సమాచారం. ఓ వైపు రవాణాశాఖ అధికారులు దాడులు చేస్తున్నా చార్జీల దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రవా ణాశాఖ అధికారులు మార్గమధ్యంలో బస్సులను నిలిపి ప్రయాణికుల నుంచి ఛార్జీలపై అడిగి తెలుసుకునే వారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవటంతో ప్రైవేటు ట్రావెల్స్‌ యాజామాన్యాలు ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  


  ఆర్టీసీ 205 అదనపు సర్వీసులు

 సంక్రాంతి సందర్భంగా తిరుగు ప్రయాణికుల కోసం ఆర్టీసీ రీజియన్‌ వ్యాప్తంగా 205 అదనపు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌టీపీ రాఘవ కుమార్‌ తెలిపారు. 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు డిపోల వారీగా అదనంగా సర్వీసులు ఏర్పాటు చేశామన్న ఆయన ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామన్నారు. 



Updated Date - 2021-01-17T05:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising