ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు ఆత్మగౌరవానికి ప్రతీక సంగం

ABN, First Publish Date - 2021-02-27T05:55:14+05:30

గుంటూరు ఆత్మగౌరవానికి సంగం డెయిరీ ప్రతీకని చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం ఆవరణలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

నరసరావుపేట టౌన్‌, ఫిబ్రవరి 26: గుంటూరు ఆత్మగౌరవానికి సంగం డెయిరీ ప్రతీకని చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం ఆవరణలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ వ్యవస్థను నడిపంచుకోవడానికి నిరంతరం పనిచేస్తామన్నారు. వ్యవసాయంలో ఒడిదుడుకులు తట్టుకునేలా గ్రామగ్రామాన పాల సేకరణతో సంగం డెయిరీ ఉత్పత్తిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించిందని ప్రభుత్వం ఏదోవిధంగా సంగంని లొంగదీసుకోవాలని చూస్తుందన్నారు. సహకార వ్యవస్థలో మనుగడ సాగించింది డెయిరీ వ్యవస్థ ఒక్కటేనన్నారు. సంగం డెయిరీ పాలక వర్గం పారదర్శకత, ప్రఽభుత్వ విధి విధానాలు ప్రకారం పనిచేస్తుందని తెలిపారు. ఎక్కడకు వెళ్శినా రైతు సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. పాలసేకరణ చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉంటే అక్కడ సంగం ఉంటుందన్నారు. ప్రభుత్వ పరంగా చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. వచ్చిన లాభాలను బోనస్‌ రూపంలో రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  

ప్రభుత్వ డబ్బుతో అమూల్‌ వ్యాపారం 

ప్రభుత్వ డబ్బుతో వ్యాపారం కోసం అమూల్‌  రాష్ట్రానికి వచ్చిందన్నారు. అమూల్‌ సహకార వ్యవస్థ అని చెప్పుకోవడానికి లేద న్నారు. రైతులపై ప్రేముంటే గుజరాత్‌లో ఇచ్చే ధరలే ఇక్కడ కూడా ఇవ్వాలన్నారు.  ఒంగోలు డెయిరీని చంపి అమూల్‌ను బతికించడానికి ప్రఽభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అమూల్‌ కంటే సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులకు అధిక ధర చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్‌ వీరేంద్ర  సీనియర్‌ మేనేజర్‌ శరత్‌బాబు, ఎండీ గోపాలకృష్ణ, మాజీ డైరెక్టర్‌ పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు గంగినేని హనుమంతురావు, కే శ్రీనివాసరావు, జగన్మోహనరావు, వేణుకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising