ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛందంగా అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-04-22T05:06:18+05:30

వాళ్లంతా యువకులే. కరోనా వైరస్‌ మనుషులను బలిగొంటూ మానవ సంబంధాలకే ముప్పు తెచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించారు.

బొంగరాలబీడులో శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్న రుద్ర చారిటబుల్‌ ట్రస్టు వలంటీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 మంది వలంటీర్లతో రుద్ర చారిటబుల్‌ ట్రస్టు సేవలు

గుంటూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వాళ్లంతా యువకులే. కరోనా వైరస్‌ మనుషులను బలిగొంటూ మానవ సంబంధాలకే ముప్పు తెచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించారు. రుద్ర చారిటబుల్‌ ట్రస్టుని ఏర్పాటుచేసి స్వచ్ఛందంగా సేవచేసే వారిని నియమించారు. కరోనా మహమ్మారితో ఎవరైనా మరణిస్తే కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా వారి కుటుంబ సభ్యుల వలే దహన సంస్కారాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గుంటూరు నగరంలోని నల్లపాడురోడ్డుకు చెందిన షేక్‌ సుభాని  కొంతమంది వలంటీర్లను కూడగట్టారు. వారందరితో కలిపి రుద్ర చారిటబుల్‌ ట్రస్టుని ఏర్పాటుచేసి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో నిత్యం ఆస్పత్రుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. చాలామంది వారి కుటుంబసభ్యుల పార్థీవ దేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. పోలీసు, ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకొని ఆయా పార్థీవదేహాలను శ్మశాన  వాటికలకు తరలించి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా అయితే నిత్యం 10 నుంచి 15 వరకు పార్థీవదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కార సేవల కోసం సెల్‌ నం. 97006 68860, 72888 99555 లకు ఫోన్‌ చేస్తే తాము సాయం అందిస్తామని వారు తెలిపారు. 

Updated Date - 2021-04-22T05:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising