ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాశివరాత్రికి 751 ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2021-03-03T05:48:07+05:30

ఈనెల 11న మహా శివరాత్రి పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రీజియన్‌ వ్యాప్తంగా 751 సర్వీసులను సిద్ధం చేస్తున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌టీపీ రాఘవకుమార్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఈడీ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం రాఘవకుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మార్చి 2: ఈ నెల 11న మహా శివరాత్రి పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రీజియన్‌ వ్యాప్తంగా 751 సర్వీసులను సిద్ధం చేస్తున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌టీపీ రాఘవకుమార్‌ తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌లోని తిక్కన సమావేశ మందిరంలో విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టి.శోభామంజరి, ఎల్‌.మధుసూదనరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.రాజశేఖర్‌ల నేతృత్వంలో సమావేశం జరిగింది. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 275, చిలకలూరిపేట డిపో నుంచి 120 సర్వీసులు, వినుకొండ డిపో నుంచి 35, మొత్తం 430 బస్సులు ఆరు క్యాంపులుగా విభజించామని పేర్కొన్నారు. వీటితో పాటు అమరావతికి 33, సత్రశాలకు 20, క్వారీకి 45, గోవాడకు 58, మన్నేపల్లికి 5, దైదకు 4, త్రిపురాంతకానికి 5, అరసవల్లికి 2, తేరాలకు 2, శ్రీశైలానికి 72, నరసరావుపేటకు 75 ప్రత్యే సర్వీసులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.   కార్యక్రమంలో ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బ్రహ్మానందరెడ్డి డిప్యూటీ సీటీఎంలు వై.రాజశేఖర్‌, ఎన్‌.శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ శరత్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-03T05:48:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising