ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిలో అర్ధరాత్రి రహదారుల ధ్వంసం

ABN, First Publish Date - 2021-07-25T21:09:19+05:30

అమరావతి నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూల్చేస్తున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రుల స్వప్నం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని పూనుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూల్చేస్తున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రుల స్వప్నం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని పూనుకుంది. అయితే అందుకు విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చివేశారు. ఇటీవల లింగాయపాలెం-ఉద్దండ్రాయునిపాలెం సమీపంలో ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన ఫ్లాట్‌ఫామ్‌ను ధ్వసం చేశారు. ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతంలో అర్ధరాత్రి రహదారులను దుండగులు ధ్వంసం చేస్తున్నారు. తాజా పరిణామాలతో రాజధాని ప్రాంత రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అర్ధరాత్రి రహదారులను ధ్వంసం చేశారు. ఉద్దండరాయనిపాలెంలో రహదారి ధ్వంసాన్ని దళిత నేతలు పరిశీలించారు.


ఇటీవల లింగాయపాలెం-ఉద్దండ్రాయునిపాలెం సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ఫ్లాట్ ఫామ్‌ను ధ్వంసం చేశారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం లింగాయపాలెం-ఉద్దండ్రాయునిపాలెం మధ్యలో కృష్ణానదిపై గుంటూరు-కృష్ణా జిల్లాలను కలుపుతూ రాజధాని అమరావతి వేళ్లే మార్గం పనులను గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. బ్రిడ్జికి కావాల్సిన సామగ్రి తరలించేందుకు రెండు గ్రామాల మధ్య రైతులు ఇచ్చిన భూములలో ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేశారు. ప్రభుత్వం మారటంతో ఐకానిక్‌ బ్రిడ్జిని రద్దు చేశారు. దీంతో ఉద్దండ్రాయునిపాలెం వద్ద ఉన్న ఐకానిక్‌ ఫ్లాట్‌ఫాంను ధ్వంసం చేశారు. 

Updated Date - 2021-07-25T21:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising