ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాప్రదాత పాటిబండ్ల రామకృష్ణ మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:53:58+05:30

తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన విద్యా ప్రదాత అయిన పాటిబండ్ల రామకృష్ణ(84) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మృతి చెందారు.

పాటిబండ్ల రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌ ఉన్నతికి కృషి

తాడికొండ, మే 16: తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన విద్యా ప్రదాత అయిన పాటిబండ్ల రామకృష్ణ(84) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడ చికిత్స పొందుతున్నారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌ ఉన్నతికి ఆయన ఎంతో కృషి చేశారు. రామకృష్ణ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం మానేసి ఎన్‌జీ రంగా పిలుపు మేరకు, ఆయన శిష్యుడి ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేశారు. లాంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి భూములను సేకరించడానికి ఎంతో కృషి చేశారు.  లాం గ్రామస్థులు తాగునీటికి ఇబ్బంది పడకుండా యలమంచిలి శివాజీతో కలిసి చెరువును సాధించి నీళ్లకు ఇబ్బంది లేకుండా చేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌ను స్ధాపించడానికి కృషి చేయటమే కాకుండా పాఠశాల కమిటీ మెంబరుగా సుమారు 40 ఏళ్లు పనిచేశారు. పాఠశాలలో భవనాలు నిర్మించటం, పాఠశాల అభివృద్ధి చేయడంలో కమిటీని ముందుండి నడిపించారు. పేద విద్యార్థులకు చేయూత ఇచ్చి ఎంతోమంది డాక్టర్లుగా స్థిరపడడానికి సహాయ సహకారాలు అందించారు. దేశ, విదేశాల్లో ఉన్న సుమారు వెయ్యి మంది డాక్టర్లు రామకృష్ణ శిష్యులే. గురువుగారుగా ఆయన ప్రసిద్ధి చెందాడు. విద్యార్థుల ఉద్యమాల్లో పాల్గొని వారి సమస్యల పరిష్కరానికి కృషి చేశారు. రామకృష్ణ మృతి తీరని లోటని లాం గ్రామస్థులు, యలమంచిలి శివాజీ సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-17T05:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising