ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ వైపున రైల్వే జనరల్‌ టిక్కెట్స్‌ కౌంటర్లు

ABN, First Publish Date - 2021-10-22T05:10:21+05:30

రైల్వేస్టేషన్‌ పశ్చిమ(అరండల్‌పేట) వైపున భవన నిర్మాణ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా మూసేసిన జనరల్‌ టిక్కెట్ల బుకింగ్‌ కౌంటర్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌ రైల్వే అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

అరండల్‌పేట వైపున తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జనరల్‌ టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్‌ పశ్చిమ(అరండల్‌పేట) వైపున భవన నిర్మాణ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా మూసేసిన జనరల్‌ టిక్కెట్ల బుకింగ్‌ కౌంటర్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌ రైల్వే అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక టిక్కెట్‌ కౌంటర్లను కొవిడ్‌ ప్రారంభమైన తర్వాత పూర్తిగా మూసేశారు. యథావిధిగా రాకపోకలు సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో టిక్కెట్‌ కౌంటర్లు లేక ప్రయాణికులు అసౌకర్యానికి గురౌతున్నారు. ఈ విషయాన్ని ఎంపీలు కూడా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శుక్రవారం(ఈ నెల 22) నుంచి రైల్‌మహల్‌ వెనక వైపున తాత్కాలికంగా ఒక బుకింగ్‌ కౌంటర్‌ని ఏర్పాటు చేసి ప్రవేశమార్గాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ టిక్కెట్లు తీసుకొని ఫుట్‌ బ్రిడ్జి ద్వారా ప్లాట్‌ఫాంల పైకి ప్రయాణికులు చేరుకోవచ్చని తెలిపారు. 

 

Updated Date - 2021-10-22T05:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising