ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిసార్ట్స్‌ పేరుతో తెనాలి దంపతులకు మోసం

ABN, First Publish Date - 2021-04-16T15:17:39+05:30

రిసార్టు పేరిట తమను మోసం చేయడమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రుల పేరిట బెదిరిస్తున్నట్లు కేసీఆర్‌ పేషీలో బాధితుల ఫిర్యాదు 


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రిసార్టు పేరిట తమను మోసం చేయడమే కాకుండా  చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే టీఆర్‌ఎస్‌ మంత్రుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతు న్నారంటూ తెనాలికి చెందిన మధుసూదన్‌బాబు దంపతులు సీఎం కేసీఆర్‌ పేషీ, డీజీపీలకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది, ప్రస్తుతం పాస్టర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌బాబుకు 2020, జనవరి 29న విజయవాడలోని సీవీఆర్‌ చాంబర్‌లో ఉన్న ఫిసూన్‌ హాలీడేస్‌ కంపెనీ ప్రతినిధులు ఫోన్‌ చేసి కూపన్‌ వచ్చింది, తక్కువ డబ్బులు చెల్లించి రిసార్ట్స్‌లో జాయిన్‌ కావచ్చని చెప్పారు. రిసార్ట్స్‌లో 30 ఏళ్ల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. దాంతో మదుసూ దన్‌బాబు తన భార్య దుర్గమ్మ పేరుతో రూ.3.60 లక్షలు చెల్లించి బుకింగ్‌ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత ఆర్నెల్ల క్రితం వెళ్తే రిసార్ట్‌ లేదని నిర్వాహకులు చెప్పారు. ఫోన్‌ చేసి నగదు అడిగితే చంపేస్తామని సంస్థ ప్రతినిధి నాగిరెడ్డి బెదిరిస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. రిసార్ట్స్‌కు చెల్లించిన డబ్బును ఇప్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-04-16T15:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising