ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలనపడిన వాతావరణ నమోదు కేంద్రం

ABN, First Publish Date - 2021-03-31T05:35:32+05:30

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే రెంటచింతలలో వాతావరణ నమోదు కేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

వాతావరణ నమోదు కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాది నుంచి సాంకేతిక సమస్యలు

రెంటచింతల, మార్చి 30: రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే రెంటచింతలలో వాతావరణ నమోదు కేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏడాదిగా ఇది మూలన పడింది. దీంతో వాతావరణ నమోదుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ వాతావరణ నమోదు కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే దీనిని ఏర్పాటు చేశారు.  1936లో దీనిని లూథరన్‌ ఆసుపత్రిలో అమర్చారు. అప్పటి నుంచి సేవలను అందిస్తూనే ఉంది. 2015లో దీనిని తాత్కాలికంగా ఎత్తేయడంతో గ్రామానికి చెందిన రైతు గోగిరెడ్డి ప్రతాపరెడ్డి పలు శాఖల అధికారులను సంప్రదించి మరలా రెంటచింతలకు వచ్చేలా కృషి చేశారు. అందులో భాగంగా 2016 జనవరిలో రూ.4 లక్షలతో అత్యంత అధునాతమైన టెక్నాలజీతో పాఠశాలలో  వాతావరణ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాలను కొరియా దేశంనుంచి తీసుకొచ్చి ఇక్కడ అమర్చారు. గంట గంటకు ఇక్కడి ఉష్ణోగ్రత, వర్షపాతం పూణేలోని ఎర్త్‌స్టేషన్‌కు, అక్కడ నుంచి ఐఎంబీ వెబ్‌సైట్‌కు సమాచారం పంపేలా ఏర్పాట్లు చేశారు. దీనికి మరమ్మతులు చేసి వాడుకలోకి తెచ్చేలా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-03-31T05:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising