ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా చౌక బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-05-11T05:45:25+05:30

లారీలోను, ఆటోలోను అక్రమంగా తరలిస్తున్న 707 చౌక బియ్యం బస్తాలను మేడికొండూరు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

చౌక బియ్యం తరలిస్తూ పేరేచర్లలో పట్టుబడిన లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడికొండూరు, మే 10: లారీలోను, ఆటోలోను అక్రమంగా తరలిస్తున్న 707 చౌక బియ్యం బస్తాలను మేడికొండూరు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.  ఉన్నతాధికారులనుంచి అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ నూతక్కి నరహరి పేరేచర్లలోని ఎల్‌ఎన్‌ఎస్‌ కాలనీ వద్ద లారీని ఆపి తనిఖీ చేయగా  ఏడు వందల బస్తాలు బియ్యం ఉన్నాయి. దీనిపై డ్రైవర్‌ను ప్రశ్నించగా కొమెరపూడి నుంచి కాకినాడకు తరలిస్తున్నట్టు చెప్పాడు. లారీని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అదే విధంగా తాడికొండ మండలం రావెల గ్రామం నుంచి 7 క్వింటాళ్ల చౌక బియ్యం బస్తాలను ఫిరంగిపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం ఆధారం పోలీసులు విచారిస్తున్నారు.  కేసు నమోదు చేసి బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు  అప్పగించారు.

Updated Date - 2021-05-11T05:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising