ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీ గోనె సంచులు డీలర్లకే చెందాలి

ABN, First Publish Date - 2021-10-27T05:04:47+05:30

సరుకులకు సంబంధించి గోనెసంచులు డీలర్లకే చెందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని రేషన డీలర్లు డిమాండ్‌ చేశారు.

పౌరసరఫరాల గోడౌన్ల వద్ద నిరసన తెలుపుతున్న రేషనడీలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవోనెం 21ను ఉపసంహరించుకోవాలి

రేషన డీలర్ల నిరసన

గుంటూరు(తూర్పు), అక్టోబరు26: సరుకులకు సంబంధించి గోనెసంచులు డీలర్లకే చెందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని రేషన డీలర్లు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం పాతగుంటూరులోని పౌరసరఫరాల గోడౌనల వద్ద రేషన డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఏబీ ప్రసాదు మాట్లాడుతూ ఖాళీ గోతాలను వెనక్కి ఇవ్వాలంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనెం 21 ద్వారా ఒక్కో రేషనడీలరు అర్బన పరిధిలో దాదాపు రూ.8వేల వరకు, రూరల్‌ పరిధిలో రూ.3వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు దిగుమతి కూలీ రూ.1,200 కూడా చెల్లించాల్సి ఉండటంతో రేషన డీలర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు. అలాగే గతంలో పంపిణీ చేసిన బియ్యం, కందిపప్పు, పంచదార, శనగలకు సంబంధించి కమీషన విడుదల చేయాలని కోరారు. ధర్నాలో రేషన డీలర్ల సంఘ నాయకులు తుమ్మల గాంధీ, దాసరి శ్రీనివాసరావు, బాలరాజునాయక్‌, కాటూరి సుబ్బారావు, మహమద్‌ మునీర్‌, ఉగ్గం శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-27T05:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising