ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతితోనే స్వర్ణాంధ్ర సాధ్యం

ABN, First Publish Date - 2021-12-30T05:40:23+05:30

అమరావతి ఎదుగుదలతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని రాజధాని రైతులు తెలిపారు.

వెంకటపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

743వ రోజుకు చేరుకున్న అమరావతి ఆందోళనలు 


తుళ్లూరు, డిసెంబరు 29: అమరావతి ఎదుగుదలతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఆందోళనలు బుధవారంతో 743వ రోజుకు చేరుకున్నాయి. రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఆదాయ వనరులాంటి అమరావతిని విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా చేశారని విమర్శించారు. అమరావతిని  అభివృద్ధి చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందోనని రాజకీయ కుట్ర పన్నారన్నారు. ఎక్కడా లేని విధంగా సీఎం జగన్‌రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయడానికి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా వెళితే ప్రజలు సహించరన్నారు. విశాఖ పట్నంలోని భూముల ధరలు పెంచుకోవడానికి మూడు ముక్కల ఆటన్నారు. ఇప్పటికే విశాఖ చుట్టు పక్కల అధికార పార్టీ నేతలు వెంచర్లు వేసి అధిక ధరలకు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అమరావతిలో కాదని విశాఖలో జరిగిందని తెలిపారు. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, ఐనవోలు, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు తదితర రాజధాని గ్రామాలలో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  


Updated Date - 2021-12-30T05:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising