ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచక పాలన సాగదు

ABN, First Publish Date - 2021-10-20T06:15:53+05:30

రాష్ట్రంలో అరాచక పాలన ఎన్నాళ్లో సాగదని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 672వ రోజుకు చేరుకుంది.

నెక్కల్లులో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

672వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, అక్టోబరు 19: రాష్ట్రంలో అరాచక పాలన ఎన్నాళ్లో సాగదని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 672వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధానిపై మోసపూరితంగా వ్యవహరించడం జగన్‌రెడ్డికే చెల్లిందన్నారు. అభివృద్ధి లేకుండా పాలన చేయటం ప్రజలు చేసుకున్న పాపమని తెలిపారు. పాలకులు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అరాచకం చేయడంపై దృష్టి పెట్టారన్నారు. ప్రతిపక్షాలను  బెదిరించి అడ్డగోలుగా పాలన చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. అమరావతికి అండగా ఉండే పార్టీలను భయపెట్టడానికే ఈ దాడి చేశారన్నారు. రాజధాని గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. 

Updated Date - 2021-10-20T06:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising