ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమాన్ని అణచి వేయాలని కుట్ర

ABN, First Publish Date - 2021-05-11T05:58:42+05:30

అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తోన్న ఉద్యమాన్ని అణచి వేయాలని పాలకులు అనేక కుట్రలు చేశారని రైతులు, మహిళలు తెలిపారు.

నెక్కల్లులో ధర్నా చేస్తున్న రైతులు, మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

510వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు 


తుళ్లూరు, తాడికొండ, మే 10: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తోన్న ఉద్యమాన్ని  అణచి వేయాలని పాలకులు అనేక కుట్రలు చేశారని రైతులు, మహిళలు తెలిపారు. రైతులు, రైతుకూలీలు, దళిత జేఏసీ నేతలు చేస్తోన్న అమరావతి ఆందోళనలు సోమవారంతో 510వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు త్యాగం చేసిన రైతులు ఆవేదన చెందుతుంటే పాలకులు అవహేళనలకు దిగుతున్నారన్నారు. అమరావతిని నిర్వీర్యం చేయాలని పాలకులు చూడటం దుర్మార్గమన్నారు. శక్తివంతమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తున్న సీఎం జగన్‌ కూర్చున్న కొమ్మనే నరికేందుకు సిద్ధపడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ధర్మం, న్యాయం తమ వైపు ఉందని పోరాటాన్ని అణగ దొక్కాలని చూస్తే నాశనం అవుతారన్నారు. పాలనాదక్షత ఉన్న వారిని ఎన్నుకుంటే ఈ తిప్పలు ఉండేవి కావని తెలిపారు.  ఒక్కఛాన్స్‌ అంటే ఎంతో అభివృద్ధి ఊహించామని..  తీరా అందలం ఎక్కి నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని 29 గ్రామాలతో పాటు రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. 

 


 


Updated Date - 2021-05-11T05:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising