ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదరించాల్సింది పోయి అవహేళనలు

ABN, First Publish Date - 2021-04-13T05:48:01+05:30

తాత, ముత్తాతల కాలం నుంచి జీవనోపాధిగా ఉన్న భూములను అమరావతి కోసం ఇచ్చాము. భూములు ఇచ్చినందుకు పాలకులు ఆదరించాలి.

వెంకటపాలెంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతిని కాదంటే ఐదు కోట్ల మందిని కాదన్నట్లే

482వ రోజు ఆందోళనల్లో ధ్వజమెత్తిన రాజధాని రైతులు


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, ఏప్రిల్‌ 12: ‘తాత, ముత్తాతల కాలం నుంచి జీవనోపాధిగా ఉన్న భూములను అమరావతి కోసం ఇచ్చాము. భూములు ఇచ్చినందుకు పాలకులు ఆదరించాలి. కాని అవహేళనలు చేస్తూ.. అవమనిస్తున్నారు..’ అని రాజధాని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని వారు చేస్తోన్న ఉద్యమం సోమవారానికి 482 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచివారు మాట్లాడుతూ అమరావతి కోసం భూములు ఇస్తే ప్రస్తుత పాలకులు రోడ్డు పాలు చేశారని విమర్శించారు. అమరావతిని కాదంటే ఐదు కోట్ల మంది ప్రజల అభిప్రాయం కాదనట్లేనని తెలిపారు. భూమిపూజ సమయంలో అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. అయితే రెండేళ్లుగా ఆ మాటే మరిచారన్నారు. ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్‌రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని 29 గ్రామాలలో రైతులు ఆందోళనలు కొనసాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం బొడ్డురాయి సెంటర్‌లో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల దీక్షలు 482వరోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం ముక్కామల గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. రాజధాని రైతులకు, అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారిని పాలకులు బెదిరిస్తున్నారన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.   


దళితుల్ని మోసం చేస్తోన్న ప్రభుత్వం

నాల్గో రోజు చైతన్యయాత్రలో భాగ్యారావు

దళితుల్ని ప్రభుత్వం మోసం చేస్తోందని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు తెలిపారు. దళిత, బహుజనుల చైతన్య యాత్ర నాల్గో రోజు సోమవారం రాజధాని పరిధిలోని దొండపాడు, రాయపూడి గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు అందాల్సిన హక్కులను సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం కాల రాస్తుందన్నారు. 41 జీవో రద్దు చేయటం దళితుల హక్కులను కాలరాయడమేనన్నారు. సమాన ప్యాకేజీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, దాని ఊసే లేకుండా చేసిందన్నారు. నిరుపేదలకు ఐదు వేల పింఛన్‌  హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. మన రాష్ట్రం మన  అమరావతి అంటూ దళితవాడల్లో చైతన్య యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ సభ్యులు చిలకా బసవయ్య, చేకూరి రవి, శానం జక్రయ్య, చిలకా మోజెస్‌, నండూరి సతీష్‌, మహిళా జేఏసీ కన్వీనర్‌ అంకం సువర్ణకమల తదితరులు పాల్గొన్నారు.  


 

Updated Date - 2021-04-13T05:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising