ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి అంటేనే వివక్ష

ABN, First Publish Date - 2021-03-08T05:42:59+05:30

అమరావతి అంటేనే ముఖ్యమంత్రి జగన్‌ వివక్ష చూపుతున్నారని రాజదాని రైతులు, మహిళలు మండి పడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు చేస్తోన్న ఉద్యమం ఆదివారం తో 446వ రోజుకు చేరుకుంది.

మొక్కులు తీర్చుకోవడానికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్తున్న మోతడక గ్రామ మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు కోట్ల మంది ఆకాంక్షలను కాలరాస్తున్న జగన్‌

446 రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు, మహిళలు


తుళ్లూరు, తాడేపల్లి, మార్చి 7: అమరావతి అంటేనే ముఖ్యమంత్రి జగన్‌ వివక్ష చూపుతున్నారని రాజదాని రైతులు, మహిళలు మండి పడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు చేస్తోన్న ఉద్యమం ఆదివారం తో 446వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతి పేరు వింటేనే సీఎంకు కంపరంగా ఉందన్నారు. రైతుల బతుకులను రోడ్డు పాలు చేసి ఆనందపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నామని చెప్పి, ఇప్పుడు మూడు ముక్కల ఆట ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ను గౌరవించాలని ప్రభుత్వం ప్రచా రం చేస్తుందని.. అయితే ఆ మహి ళలు అమరావతి కోసం ఆందోళనలు చేస్తుంటే పోలీసుల చేత కొట్టించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అమరావతి మహిళలు చేస్తున్న ఉద్యమం కనబడటం లేదా అని అన్నారు. ఇంత వరకు ఒక్కసారైనా మహిళలను సీఎం జగన్‌ పరామర్శించారా అని ప్రశ్నించారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. తుళ్లూరు మండల పరిధి లోని రాజధాని గ్రామాలతో పాటు తాడేపల్లి మండలం పెనుమాకలో  రైతుల నిరసన దీక్షలు 446వరోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఐ కాస నేతలు, స్థానిక రైతులు, మ హిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


కనకదుర్గమ్మకు మొక్కులు

తాడికొండ: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తాడి కొండ మండలం మోతడక  గ్రా మానికి చెందిన మహిళలు విజ యవాడ కనకదుర్గ అమ్మవారిని ఆది వారం దర్శించుకున్నారు. గ్రామం నుంచి వెళ్లిన 30 మంది మహిళలు అమరావతి కోసం అమ్మవారికి మొ క్కుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రైతుల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. న్యాయం రైతుల పక్షానే ఉన్న దని, దేవతల దీవెనలు రైతుల కు ఉంటా యన్నారు. అమరావతిని ఏకైక రాజఽ దానిగా కొనసాగించాలని తిరు మ లకు పాదయాత్రగా వెళ్లిన మోత డక రైతులు నెల్లూరు జిల్లా గొల గమూడి గ్రామానికి చేరుకున్నారు. 


Updated Date - 2021-03-08T05:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising