ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడుతో రాష్ట్రం చిన్నాభిన్నం

ABN, First Publish Date - 2021-03-06T06:19:46+05:30

మూడు రాజధానులతో రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుందని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. అమరావతి కోసం వారు చేస్తోన్న ఉద్య మం శుక్రవారంతో 444వ రోజుకు చేరుకుంది.

పెదపరిమిలో అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏకైక రాజధానిగా అమరావతితోనే అభివృద్ధి 

 444వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మార్చి 5: మూడు రాజధానులతో రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుందని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. అమరావతి కోసం వారు చేస్తోన్న ఉద్య మం శుక్రవారంతో 444వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రాన్ని నాశనం చేయాలని పాలకులు చూస్తున్నారన్నారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమ ని తెలిపారు. మూడు రాజధానుల్లో పాలకుల స్వార్థ ప్రయోజనాలున్నాయ న్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించి, రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం బొడ్డురాయి సెంటర్‌లో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల నిరసన దీక్షలు 444వరోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు శుక్రవారం నిరసనలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాముల వారి కల్యాణ మహోత్సవానికి మోతడక దీక్షా శిబిరంలో మహిళలు ఒడ్లను చేతితో ఒలిచి తలంబ్రాలను తయారు చేస్తూ నిరసన తెలిపారు. 


 

Updated Date - 2021-03-06T06:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising