ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌పై ఏకపక్షంగా ప్రభుత్వ నిర్ణయం

ABN, First Publish Date - 2021-10-17T06:02:15+05:30

స్థానిక పీవీకేనాయుడు కూరగాయల మార్కెట్‌ అధునీకరణపై తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్‌ వర్తల సంఘం అధ్యక్షుడు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, మార్కెట్‌ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న సంక్షేమ సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 16(ఆంరఽధజ్యోతి): స్థానిక పీవీకేనాయుడు కూరగాయల మార్కెట్‌ అధునీకరణపై తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్‌ వర్తల సంఘం అధ్యక్షుడు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, మార్కెట్‌ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం తమలో భయాందోళన కలిగిస్తోందన్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం 374 దుకాణాల్లో వ్యాపారం జరుగుతోందని, దాదాపు 6 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఒకసారి వ్యాపారులతో కార్పొరేషన అధికారులు చర్చించాలని కోరారు. మార్కెట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో వర్తకులకు ప్రత్యామ్నాయంగా షాపులను కేటాయించాలని వీరిశెట్టి లక్ష్మీనారాయణ తెలిపారు. గతంలో 89 దుకాణాలు తొలగించారని, వారికి రెడ్‌ట్యాంక్‌లో షాపులు కేటాయించారే కాని ఇంత వరకు వాటిని అప్పజెప్పలేదన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాషా, సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి నిమ్మకాయల బోసు, సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising