ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ తక్షణమే రద్దుచేయాలి

ABN, First Publish Date - 2021-07-24T05:13:41+05:30

ప్రభుత్వ జారీచేసిన జాబ్‌సెల్‌ క్యాలెండర్‌ను తక్షణం రద్దు చేయడంతోపాటు కర్నూలు జిల్లా గుడూరు మండలం, పర్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి రమేష్‌ కుటుంబానికి రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్‌ చేశారు.

శంకర్‌విలాస్‌సెంటర్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన

గుంటూరు(విద్య), జూలై 23: ప్రభుత్వ జారీచేసిన జాబ్‌సెల్‌ క్యాలెండర్‌ను తక్షణం రద్దు చేయడంతోపాటు కర్నూలు జిల్లా గుడూరు మండలం, పర్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి రమేష్‌ కుటుంబానికి రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్‌ చేశారు.  నిరుద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం  శంకర్‌విలాస్‌ సెంటర్‌లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నాయకుల్ని పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో  ఏఐఎస్‌ఎఫ్‌  రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి గనిరాజు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.నాసర్‌జీ, జిల్లా అధ్యక్షుడు ఎం.కిరణ్‌, రాజేశ్‌, టీఎన్‌యూఎస్‌ నాయకులు మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలియజేస్తున్న విద్యార్థి, యువజన సంఘ నేతల అరెస్టు

ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి తిరిగి కొత్తగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని నిరసనలకు దిగిన విద్యార్థి, యువజన సంఘ నేతలను అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ తదితర సంఘాల నాయకులు శుక్రవారం శంకర్‌విలాస్‌ సెంటరులో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి వెంకట సుబ్బారావు, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాని, డీవైఎఫ్‌ఐ నాయకులు తెల్లమేకల రాజేష్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, ఏఐవైఎఫ్‌ నాయకులు షేక్‌ మహబూబ్‌వలి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బొల్లాపల్లి లక్ష్మణరావు, ఏఐవైఎఫ్‌ నాయకులు జంగాల చైతన్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాగులూరి కిరణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మెటి ఆర్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ముఖ్య కార్యదర్శి బందెల నాసర్‌జీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు మన్నవ వంశీకృష్ణ తదితర 12 మంది విద్యార్థి, యువజన సంఘ నేతలను అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.



Updated Date - 2021-07-24T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising