ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బకాయిలు విడుదల చేయాలని నిరసన

ABN, First Publish Date - 2021-12-03T05:57:46+05:30

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య, మలేరియా కార్మికులకు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలును వెంటనే విడుదల చేయాలంటూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి. ముత్యాలరావు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున ్న పారిశుధ్య కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), డిసెంబరు 2: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య, మలేరియా కార్మికులకు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలును వెంటనే విడుదల చేయాలంటూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి. ముత్యాలరావు డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మిగిలిన నగరపాలకసంస్థల్లో మాదిరిగానే కార్మికులకు జీతాలతోపాటు, హెల్త్‌ అలవెన్స్‌లను చెల్లించాలన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే చీపుర్లు, పారలు కొనుక్కోమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె ఇవ్వడం లేదన్నారు. ధర్నాలో పేటేటి యాకోబు, జక్రయ్య, బందెల దేవకుమారి, ఏసుబాబు, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, రూతమ్మ, మంగమ్మ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T05:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising