ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజీహెచ్‌లో వైద్య విద్యార్థుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-08T05:26:06+05:30

రోగుల బంధువులు తమపై దాడులు చేస్తున్నా రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థులు మంగళవారం జీజీహెచ్‌లో ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలలని డిమాండ్‌ చేశారు.

జీజీహెచ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగి బంధువులు దాడి చేశారంటూ నిరసన

గుంటూరు(జీజీహెచ్‌), డిసెంబరు 7: రోగుల బంధువులు తమపై దాడులు చేస్తున్నా రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థులు మంగళవారం జీజీహెచ్‌లో ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలలని డిమాండ్‌ చేశారు. వివరాలివి.. గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో ఆదివారం రాత్రి కొందరు యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. వారిలో కొందరు గాయాలతో జీజీహెచ్‌కి వచ్చారు. గాయాలు లేని వారు బయటకు వెళ్లాలని విధుల్లో ఉన్న జనరల్‌ సర్జరీ విభాగపు విద్యార్థి కోరారు. ఈ క్రమంలో యువకులు, వైద్యవిద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలో చూసి కేసు నమోదు చేయాలని కోరారు. దీని పై పోలీసులు, జీజీహెచ్‌ ఉన్నతాధికారులు సరిగా స్పందించ లేదంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. జేసీ రాజకుమారి అక్కడకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఘర్షణకు దిగిన యువకులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులు విధులకు హాజరయ్యారు.


Updated Date - 2021-12-08T05:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising