ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసంఘాల నేతలపై అక్రమకేసులు ఎత్తివేయాలి

ABN, First Publish Date - 2021-01-20T05:34:21+05:30

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజాసంఘాల నేతలపై బనాయించిన అప్రజాస్వామిక ఉపా చట్టాన్ని, అక్రమ అరెస్టులను ఉపా రద్దుపోరాట కమిటీ కన్వీనర్‌ చిలుకా చంద్ర శేఖర్‌ ఖండించారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్‌ చిలుకా చంద్రశేఖర్‌

నరసరావుపేట, జనవరి 19:  కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజాసంఘాల నేతలపై బనాయించిన అప్రజాస్వామిక ఉపా చట్టాన్ని, అక్రమ అరెస్టులను ఉపా రద్దుపోరాట కమిటీ కన్వీనర్‌ చిలుకా చంద్ర శేఖర్‌ ఖండించారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ఇప్పటివరకు అరెస్టు చేసిన వారిని విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రజాసంఘాల నాయకులపై ఉపా కింద కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. 4 దశాబ్దాలుగా బహిరంగ ప్రజాజీవనం సాగిస్తూ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న వారికి మావోయిస్టులతో సంబంధాలు అంటగట్టి ఇప్పటికే 10 మంది నాయకులను బలవంతంగా అరెస్టు చేసి జైలు పాలు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యతిరేక చర్యలను తీసుకువచ్చిందన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టాన్ని ప్రయోగించి వారిని అణిచివేయాలని చూడడం దుర్మార్గమని విమర్శించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కలిసి పోరాడాలని కోరారు. ఉపా రద్దయ్యేవరకు ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. ఈ చట్టం కింద అరెస్టుచేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాలని  చంద్రశేఖర్‌ కోరారు. కేంద్రరాష్ట్రాల నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా  గుంటూరులోని కొరిటాల సత్యనారాయణ భవనంలో 23న ఉదయం 10గంటలకు జరిగే నిరసన బహిరంగ సభను జయప్రదం చేయాలనికోరారు. కార్యక్రమంలో కేఎన్‌పీఎస్‌ నేత కె.కృష్ణ, పీడీఎం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, నల్లపాటి రామారావు, జి.రామకృష్ణ, కె. స్వరూప్‌, కంబాల ఏడుకొండలు తదితరుల పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-20T05:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising