ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష

ABN, First Publish Date - 2021-12-12T16:38:44+05:30

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులర్పించారు. అలాగే విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దీక్ష విరమించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 


కాగా గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లేదారిలో వడ్డేశ్వరంలో పవన్ కల్యాణ్ ఆగి శ్రమదానం చేశారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేశారు. పార, గమేళా చేతబట్టి స్వయంగా మట్టిని పోశారు. కార్యక్రమం ప్రారంభంలో ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో స్థానిక జనసేన నాయకులు కిందపడిపోయారు. దీంతో ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు. 

Updated Date - 2021-12-12T16:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising