ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

visakhaను దోచుకోవడానికే అమరావతిపై విషప్రచారం: అనురాధ

ABN, First Publish Date - 2021-12-15T17:36:37+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే రైతులు అమరావతికి 33 వేల ఎకరాలు ఇచ్చారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే రైతులు అమరావతికి 33 వేల ఎకరాలు ఇచ్చారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా కొనసాగించి ఉంటే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని తెలిపారు. చేతకాని సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని చంపేశారని ఆరోపించారు. రాజధానిపై కులముద్రవేసి సంపదకు గండికొట్టారన్నారు. విశాఖను దోచుకోవడానికి అమరావతిపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. తుగ్లక్ ప్రభుత్వ ఇబ్బందులను తట్టుకుని 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రైతులకు పాదాభివందనం చేస్తున్నామని చెప్పారు. అమరావతి మహిళలను వేధింపులకు గురిచేయడమే కాకుండా.. రైతులపై 1100 అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో అభివృద్ధిని పరుగులు పెట్టించినట్లు గుర్తుచేశారు.  ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని టీడీపీ విధానం అని పేర్కొన్నారు. కోర్టులో చీవాట్లు తప్పవనే భయంతోనే 3 రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అనురాధ వెల్లడించారు.

Updated Date - 2021-12-15T17:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising