ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి: సీపీఎం

ABN, First Publish Date - 2021-09-17T14:00:31+05:30

కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఎం 22వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. హుస్సేన్‌ వలి అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణయ్య మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టం, కార్మికుల హక్కుల ను హరిస్తూ తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు, ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ, మానిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వ సంస్థలను సర్వీసు రంగాలను లీజుకు ఇచ్చేవిధానం వంటి చర్యలతో రాబోవు రోజుల్లో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుందన్నారు. వీటిని అడ్డుకోవడంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌ భవన్నారాయణ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-17T14:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising