ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలువలలో కూడిన విద్యను అందించాలి

ABN, First Publish Date - 2021-12-02T05:48:56+05:30

నైతిక విలువలో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

యూనివర్సిటీలో జరిగిన నీతి అయోగ్‌ సమావేశంలో సమీక్షిస్తున్న వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీతి అయోగ్‌ వీసీ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ 

పెదకాకాని, డిసెంబరు1: నైతిక విలువలో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో  బుధవారం వర్సిటీల విద్య, వ్యవసాయంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ  రీజనల్‌ యూనివర్సిటీలను సందర్శించి వాటిలో అందుతున్న విద్యా ప్రమాణాలు, బోధన గురించి తెలుసుకుంటున్నామన్నారు.  ఏఎన్‌యూ 

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఎ.విష్ణువర్ధనరెడ్డి  మాట్లాడుతూ యాంత్రీకరణ వలన రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన తెలిపారు.  ఆర్‌జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెడుతున్న ఖర్చును పెట్టుబడిగా చూడాలని, సంక్షేమంగా కాదని  తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ క్వాలిటీ విద్యను అందించేందుకు యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలన్నారు.  కార్యక్రమంలో నీతి అయోగ్‌ సెక్రటరీ డాక్టర్‌ రాజేశ్వరరావు, సీనియర్‌ అడ్వయిజర్‌ డాక్టర్‌ నీలం పటేల్‌, మరో అడ్వయిజర్‌ సీహెచ్‌పీ శరత్‌రెడ్డి, ఏపీ ఎస్‌ఈహెచ్‌ఈ ప్రొఫెసర్‌ కె.రామ్మోహనరావు, ఎం.రామ్‌కుమార్‌, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌, తాడేపల్లిగూడెం నిట్‌ వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ ఉదయశంకరరెడ్డి,  ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్యామలారావు తదితరులు పాల్గొన్నారు. 

 రైతులను ఆదుకోవాలి.. 

రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నీటి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేరళ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ నాయకులు రావుల వెంకటయ్య, ఆళ్ల గోపాలకృష్ణ, డాక్టర్‌ కొల్లి రాజా రామ్మోహన్‌, ఏ.రామారావు, వై.కేశవరావు, ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-02T05:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising