ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-07-24T05:10:14+05:30

నిరుపేదలకు బలవర్ధక ఆహారాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఆహార భద్రత చట్టం( ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పర్యవేక్షణ కమిటీ నోడల్‌ అధికారి ఉపేంద్రసింగ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ నోడల్‌ అధికారి ఉపేంద్రసింగ్‌, పాల్గొన్న జేసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ నోడల్‌ అధికారి ఉపేంద్రసింగ్‌

గుంటూరు(తూర్పు), జూలై23: నిరుపేదలకు బలవర్ధక ఆహారాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఆహార భద్రత చట్టం( ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పర్యవేక్షణ కమిటీ నోడల్‌ అధికారి ఉపేంద్రసింగ్‌ అన్నారు. కలెక ్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో జిల్లాలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ అమలుపై శుక్రవారం విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆహరభద్రత చట్టం అమల్లో వచ్చిన సమస్యలకు పరిష్కారం విజిలెన్స్‌ మానిటిరింగ్‌ కమిటీ ద్వారానే సాధ్యమవుతాయని తెలిపారు. జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 14,92,004 బియ్యం కార్డులు ఉన్నాయని, వీటిలో 8,54,265 ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ బియ్యం కార్డులు ఉన్నాయని తెలిపారు.  సమావేశంలో జేససీ శ్రీధర్‌రెడ్డి, విజిలెన్స్‌ మానిటరింగ్‌ కన్వీనర్‌, పౌరసరఫరాల అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

రేషన్‌ పంపిణీ తీరు పరిశీలన 

పిడుగురాళ్ల: కేంద్రప్రభుత్వం కొవిడ్‌ సమయంలో  ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న తీరును జాతీయ ఆహార ఉత్పత్తిపథకం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఉపేంద్రసింగ్‌ శుక్రవారం పిడుగురాళ్లలో పరిశీలించారు. తొలుత 1వ నెంబర్‌ షాపును పరిశీలించి అక్కడ సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సర్వర్‌ నిదానంగా ఉండడంతో బియ్యం పంపిణీ సక్రమంగా జరగటం లేదన్న విషయాన్ని తెలుసుకుని జాయింట్‌ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం మార్కెట్‌యార్డులోని పౌరసరఫరాల శాఖ గోడౌన్‌ తనిఖీ చేసి కందిపప్పు, పంచదార ప్యాకెట్లను పరిశీలించి తూకం, నిల్వతేదీలు పరిశీలించారు. అనంతరం వీరాపురంలో రేషన్‌ దుకాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీఎస్‌ఓ పద్మశ్రీ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ జయంతి, సీఎస్‌డీటీ శర్మతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising