ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరు పారే దారేది..?

ABN, First Publish Date - 2021-05-15T06:15:21+05:30

తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ (ఏఆర్‌పీఎస్‌) నుంచి పంట కాలువల ద్వారా తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాలలోని గ్రామాల పంటచేలకు నీరు అందుతోంది.

కనపించకుండా పూడుకుపోయిన పంటకాలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి, మే14: తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ (ఏఆర్‌పీఎస్‌) నుంచి పంట కాలువల ద్వారా తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాలలోని గ్రామాల పంటచేలకు నీరు అందుతోంది. గతంలో దాదాపు 3500 ఎకరాలకు పైగా పంపింగ్‌ స్కీమ్‌ కింద ఉన్న ఆయకట్టు నేడు దాదాపు సగానికి పడిపోయింది. మిగిలిన సగంలో కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, రామచంద్రాపురం, కొండూరు, ప్రాంతం వరకు స్కీమ్‌ కింద ఉన్న పంటలకు నీరు అందుతోంది. దాదాపు 12కిలోమీటర్ల మేర ఈ పంట కాలువ ప్రవహిస్తుంటుంది. 


వ్యర్థాలతో పూడుకుపోయిన పంటకాలువ...


ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ ప్రారంభం నుంచే పంటకాలువలో వ్యర్థాలు కనిపిస్తుంటాయి. బైపాస్‌ దాటిన తరువాత కుంచనపల్లి నుంచి పంటకాలువ మొత్తం భారీగా పిచ్చిమొక్కలు, రెల్లుగడ్డి వ్యర్థాలతో నిండి చుక్కనీరు కూడా ముందుకు పారే దారి లేక కనిపిస్తుంటుంది. చూసేవారికి అసలు అది పంట కాలువేనా అన్న చందాన కనిపిస్తోంది. కుంచనపల్లి ప్రాంతంలో పంట కాలువ సమీపంలో ఉండే అపార్టుమెంట్ల నుంచి వ్యర్థాలు, నీరు మొత్తం పంట కాలువలోకే చేరుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యర్థాలతో పంట కాలువ మొత్తం కలుషితమవడమే కాక, పంట కాలువ పక్కనే ఉన్న పంటలకు సంబంధించి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని అంటున్నారు. తాజాగా గురువారం కుంచనపల్లిలో ఓ రైతు పంటపొలంలో ఉన్న బోరుబావి వద్ద మోటారు వేయగానే భారీ నురగతో నీరు రావడంతో రైతులు బెంబేలెత్తారు. భూగర్భజలాలు కలుషితమైతే, పంటల ఉత్పత్తి తగ్గిపోతుందని వాపోతున్నారు. 


ప్రారంభం కాని పూడికతీత పనులు...

వేసవికాలంలో పంట చేలన్నీ ఖాళీగా దర్శనమిస్తుంటాయి. మైనర్‌, మేజర్‌ పంట కాలువలన్నీ వ్యర్థాలతో పిచ్చిమొక్కలతో నిండిపోయి, పూడుకుపోయి కాలువల ఆనవాలు లేకుండా ఉన్నాయి. మే నెల రాగానే కాలువల్లో పూడికతీత పనులు మొదలు పెడుతుంటారు. జూన్‌, జులైకల్లా పంటలకు నీరు అందించేలా సమాయత్తమవుతారు. కాలువ చివరి భూముల వరకు నీరు అందేలా ఈ మరమ్మతుల నిర్వహణ జరుగుతుంది. అయితే మే 15 వచ్చినప్పటికీ నేటికీ పూడికతీత పనుల ఊసే కనిపించడం లేదని రైతులు అంటున్నారు. సహజంగా రైతు సంఘాల వారే చొరవ తీసుకుని పూడికతీత పనులు నిర్వహిస్తుంటారు. సంబంధిత అధికారులు స్పందించి ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ పంటకాలువ పూడిక తీయించి, అపార్టుమెంట్ల వ్యర్థాలు పంటకాలువలో కలవకుండా కఠినచర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-15T06:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising