ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎన్‌యూకి జాతీయ స్థాయి ర్యాంక్‌

ABN, First Publish Date - 2021-08-02T05:52:43+05:30

ఇండియాటుడే 2021 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ ఉత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం జాతీయస్థాయిలో 15వ స్థానాన్ని పొందిందని విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని, ఆగస్టు 1: ఇండియాటుడే 2021 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ ఉత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం జాతీయస్థాయిలో 15వ స్థానాన్ని పొందిందని విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. అత్యధిక పేటెంట్లు దాఖలు చేసిన కేటగిరిలో 1వ ర్యాంకును, అత్యధిక పేటెంట్లను ప్రచురించిన కేటగిరిలో 2వ ర్యాంకును కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి మాట్లాడుతూ నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు వంటి అంశాల్లో విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో  ఉన్నట్లు పేర్కొన్నారు. డాక్టర్‌ బి.కరుణ, ర్యాంకుల సమన్వయకర్త డాక్టర్‌ భవనం నాగకిషోర్‌, ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, డైరెక్టర్‌లు, ఓఎస్‌డిలు, హెచ్‌ఓడీలు, కో-ఆర్డినేటర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-02T05:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising