ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణమ్మ.. ఉప్పొంగే..

ABN, First Publish Date - 2021-07-28T05:30:00+05:30

కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వరం, పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురిశాయి.

నాగార్జున సాగర్‌ జలాశయంలో నీటినిల్వ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోటెత్తుతున్న వరద నీరు 

సాగర్‌లో 541 అడుగులకు చేరిన నీటినిల్వ

శ్రీశైలంలో గరిష్టస్థాయికి నీటి మట్టం

నేడు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

కుడికాలువ ఆయకట్టు రైతుల్లో ఆనందం


కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది.. జలాశయాలకు వరదనీరు పోటెత్తుతోంది. ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 15న కుడి కాలువకు నీటి విడుదలకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది.   జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉండటంతో సాగర్‌ ఆయకట్టు రైతులు వరిసాగుకు సమాయత్తమవుతున్నారు. 


నరసరావుపేట, జూలై 28: కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వరం, పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, జూరాల ప్రాజెక్టుల గేట్టు ఎత్తివేసి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కో ప్రాజెక్టు నుంచి దిగువకు 3.30 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4,99,798 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి సాగర్‌కు గురువారం నీరు విడుదల చేయనున్నారు. కృష్ణమ్మ ఉప్పొంగుతుండడంతో సాగర్‌ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

  శ్రీశైలం జలాశయంలో 215.81 టీఎంసీలు పూర్తిస్థాయి నీటినిల్వ కాగా బుధవారం సాయంత్రం 188.14 టీఎంసీలకు చేరింది. వరద నీరు పోటెత్తుతుండటంలో నాగార్జునసాగర్‌కు కూడా వరద నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు వుండటంతో సాగర్‌ ఆయకట్టు రైతులు వరిసాగుకు సమాయత్తమవుతున్నారు. రానున్న వారం రోజుల్లో శ్రీశైలానికి సూమారు 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని జలవనురుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీరంతా సాగర్‌కు రానుంది. ప్రస్తుతం ఉన్న వరద ప్రవాహం అంచనాల మేరకు సాగర్‌ కూడా 10 రోజుల్లో పూర్తిస్థాయికి నీటిమట్టం చేరుతుందని అధికారులు అంచానా వేస్తున్నారు. 


15 కల్లా నీటి విడుదలకు ఏర్పాట్లు

 నాగార్జున సాగర్‌ జలాశయం వరుసగా మూడవ ఏడాది కూడా నిండనుంది. ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 15న కుడి కాలువకు నీటి విడుదలకు జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. డ్యాం నిండి క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు పూర్తిగా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గేట్లు ఎత్తిన తర్వాత కుడి కాలువకు నీరు విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు కారణం ఇప్పుడే నీటిని విడుదల చేస్తే ఈ నీరు లెక్కల్లోకి వస్తుంది. గేట్లు ఎత్తిన తర్వాత నీటిని విడుదల చేస్తే నీరు లెక్కల్లోకి రాదని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాగర్‌ పూర్తి నీటి నిల్వ 312.05 టీఎంసీలు, బుధవారం 190.42 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలానికి వచ్చే వరద నీటిని వచ్చింది వచ్చినట్టుగా విడుదల చేయనున్నారు. జలవనరుల శాఖ అంచనాల ప్రకారం రానున్న 10 రోజుల్లో సాగర్‌ నిండుతుంది. 

                    

వివిధ జలాశయాలో నీటి నిల్వలు ఇలా..


జలాశయం          పూర్తి నీటి సామర్థ్యం       ప్రస్తుత నీటి నిల్వలు     వస్తున్న నీరు          విడుదల చేస్తున్న నీరు

                       (టీఎంసీలు)                (టీఎంసీలు)          (క్యూసెక్కలు)           (క్యూసెక్కులు)

ఆల్మట్టి                     123.08                    81.78                4,12,492                3,40,983

నారాయణ్‌పూర్‌              33.31                    22.27                3,37,459                3,36,644

జూరాల                      9.66                     6.51                3,32,138                3,30,020

శ్రీశైలం                     215.81                   188.14                4,99,798                 71,823

నాగార్జున సాగర్‌            312.05                   190.42                  64,548                  1,000

Updated Date - 2021-07-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising