ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఉద్యమం

ABN, First Publish Date - 2021-02-27T05:30:00+05:30

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు మరోసారి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ప్రజలు సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ  

బాపట్ల ,ఫిబ్రవరి 27: ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు మరోసారి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ప్రజలు సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలో శనివారం ఆయన సీపీఐ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  అంతరిక్ష పరీక్షా కేంద్రం, ఎల్‌ఐసీ నుంచి రైల్వే వరకు, ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వ రంగసంస్థలన్నిటినీ టోకున అమ్మివేసే ఒక దుర్మార్గ ఆర్థిక విధానానికి బీజేపీ పూనుకుందన్నారు.  విశాఖ ఉక్కును కొంటానికి వస్తే తరిమి కొడుతామని ప్రజలు తరఫున ఆయన హెచ్చరించారు.  మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చిన బంద్‌లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.రాధాకృష్ణమూర్తి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.వీరాంజనేయులు, అనుబంధ అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు డి.ధనలక్ష్మి, చీరాల ఏరియా కార్యదర్శి బత్తుల శామ్యూల్‌, బాపట్ల ఏరియా కార్యదర్శి జెబి.శ్రీధర్‌, అగ్రిగోల్డ్‌ రాష్ట్ర ఉద్యమ కార్యదర్శి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising