ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌరగ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేయాలి

ABN, First Publish Date - 2021-07-27T05:25:11+05:30

మున్సిపాల్టీలు సెస్‌ కింద వసూలు చేసిన రూ.350కోట్లు పౌర గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చించాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు కోరారు.

ప్రసన్నకుమార్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డాక్టర్‌ పీవీ మల్లేశ్వర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ  కేఎస్‌ లక్ష్మణరావు

గుంటూరు (విద్య), జూలై 26: మున్సిపాల్టీలు సెస్‌ కింద వసూలు చేసిన రూ.350కోట్లు పౌర గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చించాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు కోరారు. పౌర గ్రంథాలయాల శాఖ సంచాలకులుగా నియమితులైన ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌ను లక్ష్మణరావు, ఏపీఆర్‌ఈఐటీఏ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ పీవీ మల్లేశ్వర్‌ తదితరులు సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరులోని ప్రాంతీయ గ్రంథాలయం, రాష్ట్రకేంద్ర గ్రంథాలయాలను ఆధునీకరించి నిరుద్యోగ యువతకు, పౌరులకు అందుబాటులోని తీసుకురావాలని సూచించారు. నూతన పుస్తకాలు కొనుగోలు చేసి నిరుద్యోగ యువతకు అందించాలని కోరారు.

గ్రంథాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం తగదు

విజ్ఞానకేంద్రాలుగా ఉన్న గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని, వాటిని నిర్లక్ష్యం చేయడం తగదని గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కోన దేవదాస్‌ పేర్కొన్నారు. ఈమేరకు పౌరగ్రంథాలయాల సంచాలకులు ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌ను కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. నూతనచైర్మన్ల నియామకాన్ని స్వాగతిస్తున్నామని, దీనివల్ల గ్రంథాలయాల పాలన మరింత పారదర్శకంగా సాగుతుందన్నారు.  


Updated Date - 2021-07-27T05:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising