ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ ముగింపు

ABN, First Publish Date - 2021-02-27T05:47:48+05:30

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.

ఉపాధ్యాయ అభ్యర్థులతో సమావేశమైన ఎన్నికల పరిశీలకుడు కేవీ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

19 మంది అభ్యర్థులో జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం



గుంటూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగింపు సమయం కాగా తెనాలికి చెందిన చందూ విజయలక్ష్మి ఒక్కరే నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. ఆమె భర్త చందూ రామారావు నామినేషన్‌ ఆమోదం పొందడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులతో జాబితాని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వివేక్‌యాదవ్‌ విడుదల చేశారు. నేషనల్‌ నవ క్రాంతి పార్టీకి చెందిన కనకం శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థులుగా బీ ఓంకారమయ్య, కన్నెబోయిన వంశీకృష్ణ, కల్పలత, కోట సాయికృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, చందూ రామారావు, తులసీరామ్‌ యర్రాకుల, ప్రొఫెసర్‌ దారా విక్రమ్‌, నాగస్వరం నరసింహం, పీ పాండురంగ వరప్రసాదరావు, బట్టు శ్యాంప్రసాద్‌, బొడ్డు నాగేశ్వరరావు, మత్తి కమలాకరరావు, పీవీ మల్లికార్జునరావు, రాంబాబు చెన్నకేశవులు, ఏఎస్‌ రామకృష్ణ, డాక్టర్‌ రామకోటయ్య, సాగర్‌బాబు సూరెలు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు జాబితాని విడుదల చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కల్పలతారెడ్డి ఒక్కరే మహిళ.  

అభ్యర్థులతో సమావేశం

నామినేషన్ల ఉపసంహరణ ముగియగానే అభ్యర్థులు, వారి ప్రతినిధులతో ఎన్నికల పరిశీలకుడు కేవీ రమణ, ఆర్‌వో వివేక్‌యాదవ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశీలకుడు రమణ మాట్లాడుతూ అభ్యర్థులందరూ ఎన్నికల కోడ్‌ని ఖచ్చితంగా పాటించి సహకరించాలన్నారు. అదనపు ఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ   పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షరమాల ప్రకారం, బ్యాలెట్‌ పేపర్‌లో సీరియల్‌ నెంబరు కేటాయిస్తామన్నారు.   

Updated Date - 2021-02-27T05:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising