ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల నిబంధనలపై అవగాహన ఏర్పరుచుకోవాలి

ABN, First Publish Date - 2021-03-05T06:01:19+05:30

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులు నియమ, నిబంధనలు తెలుసుకొని పోలింగ్‌ కేంద్రాల్లో విధుల ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు కేవీ రమణ ఆదేశించారు.

ప్రిసైడింగ్‌ అధికారులకు జరిగిన శిక్షణలో పాల్గొన్న ఎన్నికల పరిశీలకుడు రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకుడు కేవీ రమణ

గుంటూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులు నియమ, నిబంధనలు తెలుసుకొని పోలింగ్‌ కేంద్రాల్లో విధుల ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు కేవీ రమణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రానికి చేరిన వెంటనే ప్రిసైడింగ్‌ అధికారులు సంబంధిత కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఏ విధమైన ప్రచార సామగ్రి లేకుండా వీఆర్‌వో/పోలీసుల సహాయంతో తొలగించాలన్నారు. విధులలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా శ్రద్ధతో విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీధర్‌రెడ్డి, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ బీ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T06:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising