ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-16T06:02:18+05:30

కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా రానున్న సోమ, మంగళ, బుధవా రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలు కానున్నట్లు ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే పీఆర్కే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే పీఆర్కే

మాచర్ల, మే 15 : కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా రానున్న సోమ, మంగళ, బుధవా రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలు కానున్నట్లు ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలో ఉన్నతా ధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనాతో చిన్న వయసు వారు కూడా మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడంతోపాటు భౌతికదూరం పాటిస్తూ గృహాల్లోనే ఉండాలన్నారు. రానున్న మూడు రోజులపాటు అత్యవసర సేవలకు సంబంధించి మినహా మిగతా వ్యాపార సంస్థలు మూసివేయాలన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే పీఆర్కే కోరారు. 


రెంటచింతలలో...


రెంటచింతల, మే 15 : మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్‌ తెలిపారు. శనివారం ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  

Updated Date - 2021-05-16T06:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising