ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడున్నావు.. పాపా!

ABN, First Publish Date - 2021-10-25T05:05:09+05:30

ఎక్కడున్నావు తల్లీ.. ఎప్పుడు కనపడతావమ్మా?.. నీవు లేకపోతే మేం ఎలా బతకాలమ్మా?.. అంటూ ఏడాది కిందట పుట్టినరోజు నాడే అదృశ్యమైన కుమార్తె కోసం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు

శ్రీలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నబిడ్డ కనిపించక.. ఏడాది

ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 

పెదకూరపాడు, అక్టోబరు 24: ఎక్కడున్నావు తల్లీ.. ఎప్పుడు కనపడతావమ్మా?.. నీవు లేకపోతే మేం ఎలా బతకాలమ్మా?.. అంటూ ఏడాది కిందట పుట్టినరోజు నాడే అదృశ్యమైన కుమార్తె కోసం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఏరోజుకారోజు కుమార్తె ఆచూకీ దొరుకుతుందేమో అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీలక్ష్మి, రమేష్‌ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారి రెండవ కుమార్తె కీర్తి గత ఏడాది అక్టోబరు 26వ తేదీన వారి ఇంటి సమీపంలోని  ఆడుకుంటూ అదృశ్యమైంది. అప్పటికి ఆ చిన్నారికి నాలుగేళ్లు. అప్పటి నుంచి తల్లిదండ్రులు పాప ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ ఫలితం లేదు. పోలీసు  కేసు నమోదైనా దానిని ఛేదించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 26వ తేదీన కీర్తి పుట్టినరోజు. ఆ పాప కేసును ప్రత్యేక బృందాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తల్లిదండ్రుల కడుపు కోత తీర్చాలని స్థానికుల కోరుతున్నారు. చిన్నారి అదృశ్యంపై తుళ్లూరు డీఎస్పీ వి.పోతురాజును వివరణ కోరగా టెక్నికల్‌ టీం, ఫీల్డు టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. 

 

Updated Date - 2021-10-25T05:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising