ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

59,762 మిర్చి టిక్కీల విక్రయం

ABN, First Publish Date - 2021-04-23T05:53:29+05:30

మిర్చియార్డుకు గురువారం మిర్చి టిక్కీలు ఏమి రైతులు తీసుకురాకుండా చూసి యార్డులో నిల్వ ఉన్న వాటిని ట్రేడింగ్‌ అయ్యేలా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు గురువారం మిర్చి టిక్కీలు ఏమి రైతులు తీసుకురాకుండా చూసి యార్డులో నిల్వ ఉన్న వాటిని ట్రేడింగ్‌ అయ్యేలా చేశారు. యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 59,762 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 1,62,402 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ.7,000, గరిష్ఠంగా రూ.14,000, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,500, రూ.19,000, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.4,500, రూ.8,500 ధర లభించినట్లు సెక్రెటరి ఎం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

26 నుంచి సరుకు తెచ్చుకోవాలి

మిర్చియార్డుకు భారీగా 4 లక్షల టిక్కీలు వచ్చి నిల్వ ఉన్నందున కొత్తగా రైతులు ఎవ్వరూ ఈ నెల 25 వరకు సరుకు తీసుకురావొద్దని యార్డు సెక్రెటరి ఎం వెంకటేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి టిక్కీలు తెచ్చుకోవచ్చన్నారు. యార్డులో నిల్వ ఉన్న టిక్కీలు అన్ని ట్రేడింగ్‌ జరిగేలా చేసేందుకు సెలవు రోజు కూడా విక్రయాలు జరిగేలా చూస్తోన్నామన్నారు. మిర్చి రేటు పతనం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. అలానే యార్డుకు వచ్చేటప్పుడు కొవిడ్‌-19 జాగ్రత్తలు పాటించాలన్నారు. 


Updated Date - 2021-04-23T05:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising