ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేద పాఠశాల విద్యార్థుల మృతి బాధాకరం: మంత్రి Vellampalli

ABN, First Publish Date - 2021-12-11T16:36:17+05:30

కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం జీజీహెచ్‌లో విద్యార్థుల మృతదేహాలను వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహార్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నానానికి దిగిన సమయంలో నీటిలో పడిపోయిన ఒక విద్యార్దిని కాపాడే ప్రయత్నంలో ఘటన జరిగిందన్నారు. శృంగేరి పీఠం అధికారులతో మాట్లాడానని... ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. 


ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ...ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో వేద పాఠశాల మృతి చెందిన ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల‌ కుటుంబ సభ్యులు సాయంత్రానికి గుంటూరు చేరుకుంటారని తెలిపారు. మృతుల‌ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-12-11T16:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising