ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్న ప్రతిపక్షాలు

ABN, First Publish Date - 2021-10-26T05:49:57+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

భూమి పూజలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేల్పూరులో శీతల గిడ్డంగి శంకుస్తాపన సభలో మంత్రి కన్నబాబుత

శావల్యాపురం, అక్టోబరు 25: సీఎం జగన్మోహన్‌రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శావల్యాపురం సొసైటీ పరిధిలోని వేల్పూరులో నిర్మించనున్న శీతల గిడ్డంగి శంకుస్థాపన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబు, లోకేశ టీడీపీ నాయకుల చేత సీఎంని తిట్టిస్తూ ప్రజలలో విధ్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు.వైసీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోనేది లేదన్నారు. ఎన్నికల్లో ఓటమితో కోల్పోయిన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ అల్లర్లు సృష్టిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తని, వినుకొండ నియోజకవర్గ అభివృద్ది కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యారంగానికి ప్రత్యేక ప్రాథాన్యమిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ఎంతో ప్రయత్నించాయన్నారు. కార్యక్రమంలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్‌ కత్తెర హెనీక్రిస్టినా, జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఎంపీపీ ముండ్లమూరి సుహాసిని అనిల్‌కుమార్‌, సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి చెన్నయ్య, నాయకులు గుత్తాకోటేశ్వరరావు, చుండూరి వెంకటేశ్వర్లు, బీమని అంకారావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T05:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising