ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి దందా

ABN, First Publish Date - 2021-06-23T05:40:50+05:30

తీర ప్రాంతంలోని మోర్తోట, చెన్నుపల్లివారిపాలెం సమీపంలో కృష్ణా కరకట్టను మట్టి తవ్వకాలు యథేచ్ఛ గా చేపడుతున్నారు.

యారవ కాల్వ కట్టను సగం మేర మట్టిని తవ్వేసిన దృశ్యం.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరకట్ట ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు

కాలువ ఒడ్డున మట్టినీ వదల్లేదు..

ఇలా అయితే రాబోయే రోజుల్లో ముంపు ప్రమాదం

చోద్యం చూస్తున్న అధికారులు  


తీర ప్రాంతంలో మట్టి తవ్వ కాలు యథేచ్ఛగా సాగుతు న్నాయి. కృష్ణా కరకట్ట ప్రాంతా న్ని, బాపట్ల మండలంలో యారువ కాలువ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు ఇలా మట్టి తవ్వుతూ లక్షలాది రూపాయ లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కిలోమీటరు వరకు కాల్వకట్టను తవ్వే స్తూ సుమారు వెయ్యిలారీల మట్టిని అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. వర దల సమయంలో పెనుప్రమా దం సంభవించే అవకాశం ఉన్నా.. అధికారులు  దీనిపై  దృష్టి సారించడం లేదు. 


రేపల్లె, బాపట్లరూరల్‌, జూన్‌ 22: తీర ప్రాంతంలోని మోర్తోట, చెన్నుపల్లివారిపాలెం సమీపంలో కృష్ణా కరకట్టను మట్టి తవ్వకాలు యథేచ్ఛ గా చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐదడుగుల లోతు మట్టి తవ్వి గ్రామ సచివాలయాలు, జగనన్న కాలనీల మెరకలకు తరలి స్తున్నారు. ఆర్‌సీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదంటూ సమీపంలోని పొలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని ఇలా తవ్వుకుంటూ పోతే రానున్న రోజులలో పెద్ద ప్రమాదమే సంభవించే పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కృష్ణానదికి, కరకట్టకు మధ్య నడక గట్టు మాత్రమే ఉందని, పెద్ద పెద్ద చెరువులను తలపించే విధంగా మట్టి తవ్వేస్తున్నారని అంటున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలకు తలొగ్గి చర్యలు తీసుకోవటం లేదని, అధికారులకు కూడా పెద్ద మొత్తంలో నగదు అందించారని దీని కారణంగా ఇప్పటివరకు మట్టి తవ్వకాలపై ఒక్క కేసుకూడా నమోదు చేయలేదని వాపోతున్నారు.


బాపట్ల మండలంలో.. 

 బాపట్ల మండలం అప్పికట్ల గ్రామ సమీపంలోని యారవకాల్వ కట్ట మట్టిని అధికారపార్టీ నాయకులు అక్రమంగా తవ్వేస్తున్నారు. 100 అడుగుల వెడల్పులో ఉన్న కాల్వ కట్ట తవ్వకాల కారణంగా కుచిం చుకుపోతోంది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో మట్టిబకాసురులు కాల్వకట్టను కిలోమీటరు మేర తవ్వేస్తున్నారు. ఇప్పటికే నల్లమడ రైతు సంఘం నాయకులు బలహీన పడిన కాల్వకట్టలను మరమ్మతులు చేయాలని విన్నవించుకుంటు న్నారు. ఇలా మట్టిని తవ్వేస్తే కాల్వ కట్టలు మరింత బలహీనం అవు తాయి. 2013-2016 సంవత్సరాల్లో వరదనీటి ప్రవాహానికి మండలంలో రెండుసార్లు కాల్వకట్టలకు గండ్లుపడి జిల్లెళ్ళమూడి గ్రామం మునిగిపోయింది. మరలా అక్రమ మట్టి తవ్వకాలు జరపటంతో ఎప్పుడూ గ్రామాలకు వరదముప్పు ఏర్పడుతుందోనని జనం భయం గుప్పిట్లో ఉన్నారు. 25అడుగుల మేర కట్టను అక్రమంగా తవ్వేసి ప్రైవేట్‌ వెంచర్లకు తరలించి జేబులను నింపుకొంటున్నారు. ఇప్పటికే సుమారు 1000 లారీల మట్టిని తరలించి దాదాపు రూ.70 లక్షలు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి అక్రమ తవ్వకాలు జరిపే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై డ్రైనేజీ డీఈఈ నరేంద్రను వివరణ కోరగా యారవ కాలవ మట్టిని తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. మట్టిని అక్రమంగా తరలించటంపై చట్టరీత్యా నేరమన్నారు. 

Updated Date - 2021-06-23T05:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising