మంచికల్లులో ప్రబలిన డయేరియా
ABN, First Publish Date - 2021-04-02T06:18:09+05:30
మండలంలోని మంచికల్లు గ్రామంలో డయేరియా ప్రబలింది. పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఐదు కుటుంబాల్లోని పలువురు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
బాధితులను పరామర్శిస్తున్న తహసీల్దార్ సురేష్, డాక్టర్ ప్రదీప్
రెంటచింతల, ఏప్రిల్ 1: మండలంలోని మంచికల్లు గ్రామంలో డయేరియా ప్రబలింది. పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఐదు కుటుంబాల్లోని పలువురు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కంభంపాడు పీహెచ్‌సీ డాక్టర్ ప్రదీప్, తహసీల్దార్ సురేష్‌నాయక్‌లు గ్రామాన్ని సందర్శించారు. బోర్ ద్వారా వచ్చే నీటిని నిలిపి వేసి పరీక్షలకు పంపారు. పారిశుధ్య చర్యలు చేపట్టారు.
Updated Date - 2021-04-02T06:18:09+05:30 IST