ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కార్యాలయంలో.. గ్లాసుల గల గల

ABN, First Publish Date - 2021-10-31T05:13:49+05:30

అదొక నాన్‌ ఫోకల్‌ ప్రభుత్వ జిల్లా కార్యాలయం. గతంలో అక్కడ పనిచేసిన అధికారి వేరే కార్యాలయానికి బదిలీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రయిందంటే చాలు ఓ ఉన్నతాధికారి సిట్టింగ్‌

వారంలో నాలుగైదు రోజులు ఇదే తంతు


గుంటూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అదొక నాన్‌ ఫోకల్‌ ప్రభుత్వ జిల్లా  కార్యాలయం. గతంలో అక్కడ పనిచేసిన అధికారి వేరే కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయినప్పటికీ ఆ కార్యాలయాన్ని రాత్రివేళ తన ఆధీనంలోనే ఉంచుకొంటున్నారు. కొత్తగా ఆ కార్యాలయంలోకి వచ్చిన అధికారి తన మాట వింటే సరే లేకుంటే అతనిపై ఉన్నతాధికారులకు చాడీలు వెళ్లిపోతాయి. ఎంతవరకు అంటే అతనిని ఆ పోస్టులో నుంచి సాగనంపేంత వరకు..! ఇందుకు ప్రధాన కారణం ఆ ఆఫీసుని నైట్‌ సిట్టింగ్‌ కోసం వినియోగించుకోవడానికే. అక్కడ రాత్రి అయితే చాలు మద్యం గ్లాసుల గల గల శబ్ధాలు వినిపిస్తాయి. ఎవరికి అనుమానం రాకుండా తాను వినియోగించే వాహనాన్ని సమీపంలోని వేరొక కార్యాలయంలో డ్రైవర్‌ పార్కింగ్‌ చేసి నిరీక్షిస్తుంటారు. అయ్యగారి సిట్టింగ్‌ పూర్తి అయిన తర్వాత ఫోన్‌ చేసి డ్రైవర్‌ని పిలిపించుకొని తాపీగా ఇంటికి బయలుదేరి వెళతారు. వారంలో కనీసం నాలుగైదు రోజులు ఇదే తంతు అక్కడ. 

జిల్లాలో ఒక ప్రాజెక్టు కోసం ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ పెద్దగా పని లేదు. సెలవులోకి వెళ్లి తిరిగి వచ్చిన అధికారులను ప్రభుత్వం ఆ కార్యాలయంలోకి పోస్టింగ్‌ చేస్తుంటుంది. వారికి పని లేకపోవడంతో జిల్లాలో ఇతర విధులకు సేవలను వినియోగిస్తుంటారు. రాత్రి అయితే ఆ కార్యాలయం చీకటిగా మారిపోతుంది. ఇది గతంలో అక్కడ పని చేసిన అధికారికి అనువుగా మారింది. ఆయనకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో రాత్రి వేళ ఆ ఆఫీసుని వినియోగించుకొంటున్నారు. ఈయన పనిచేసే పోస్టుకి పెద్దగా రక్షేత పర్యటన ఉండదు. అయినప్పటికీ ప్రతీ నెలా రూ.వేలల్లో ఇంధనం బిల్లులు డ్రా చేస్తున్నారు. గతంలో ఒక ఉన్నతాఽధికారి ఆ బిల్లులను ఆరా తీశారు. నెల అంతా ఫీల్డ్‌పైకి వెళ్లే తన వాహనం కంటే ఎక్కువగా డీజిల్‌ బిల్లులు డ్రా చేస్తుండటాన్ని చూసి విస్తుబోయారు. తన కార్యాలయానికి పిలిపించుకొని వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ అధికారి తీరు మారలేదు. ప్రభుత్వ స్థాయిలో ఉన్నతాధికారులకు తానే అంతా సమాచారం ఇచ్చేదని బయటికి చెప్పుకొంటూ కిందిస్థాయి వారిని బెదరగొడుతుంటారు. ఆ అధికారి చర్యలను భరించలేకపోతున్న కిందిస్థాయి ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధమౌతున్నారు. 


 

Updated Date - 2021-10-31T05:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising