ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరంబోకు భూమి.. హాంఫట్‌

ABN, First Publish Date - 2021-08-11T04:19:21+05:30

పట్టణ నడిబొడ్డులో విలువైన 14 సెంట్ల భూమి కబ్జాదారుల చేతిలోకి వెళ్లింది. ఐనాక్స్‌ థియేటర్‌ ఎదురుగా సర్వే నంబరు 301లో దోవ పోరంబోకు భూమి ఉంది.

కుంట భూమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలువైన భూమిపై ఓ సర్వేయర్‌ కన్ను

పూర్వీకుల ఆస్తిగా చూపుతూ రిజిస్ర్టేషన 

విషయం ఉన్నతాధికారుల దృష్టికి..

కారంపూడి, ఆగస్టు 10: పట్టణ నడిబొడ్డులో విలువైన 14 సెంట్ల భూమి కబ్జాదారుల చేతిలోకి వెళ్లింది. ఐనాక్స్‌ థియేటర్‌ ఎదురుగా సర్వే నంబరు 301లో దోవ పోరంబోకు భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.లక్షల్లో పలుకుతోంది. మండల సర్వేయర్‌ కన్ను ఈ భూమిపై పడింది. దాన్ని కాజేసేందుకు పథకం పన్నాడు. తనకు బంధువే అయిన బాపట్లలోని ఓ వ్యక్తిని పిలిపించి సంబంధిత 14 సెంట్ల స్థలాన్ని పూర్వీకుల ఆస్తిగా చూపుతూ నకిలీ రిజిసే్ట్రషన చేయించాడు. నకిలీ సంతకాలతో 2017లోనే పట్టా పొందినట్టుగా సృష్టించారు. ఇందులో రెవెన్యూ కార్యాలయంలోని మరో అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ 14 సెంట్ల స్థలంకు సంబంఽధించి 4 సెంట్లను సదరు కారంపూడి మండల సర్వేయర్‌ తన పేరుపై రిజిసే్ట్రషన చేయించుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పడి బయటకు పొక్కింది. ఇది కాస్తా తహసీల్దార్‌ ప్రసాదరావు దృష్టికి వెళ్లడంతో ఆయన మాచర్ల మండలానికి చెందిన సర్వేయర్‌ను ఇక్కడ కొలతలకు ఆదేశించారు. ఆ సర్వేయర్‌ కొలతల్లో ఆరు సెంట్లు మాత్రమే పోరంబోకు భూమిగా నివేదికలో తేల్చారు. కాగా జిల్లా కలెక్టర్‌ మరోమారు నివేదిక సమర్పించాలని గురజాల డివిజన సర్వేయర్‌ను ఆదేశించారు. రెండ్రోజుల క్రితం డివిజన సర్వేయర్‌ ఇక్కడకు వచ్చి కొలతలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ పోరంబోకు భూమి అసలు లేదని, అంతా పట్టాభూమి అంటూ బహిరంగంగా ప్రకటించారు రిజిసే్ట్రషన చేయించుకున్న సర్వేయర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ప్రసాదరావు తెలిపారు. 

 

Updated Date - 2021-08-11T04:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising