ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమశేఖర్‌ కుటుంబానికి పరామర్శ

ABN, First Publish Date - 2021-06-17T05:21:02+05:30

వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన ఉంగుటూరు సర్పంచి మేదరమెట్ల అనూరాధ భర్త సోమశేఖర్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పరామర్శించి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సోమశేఖర్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి భరోసా


అమరావతి, జూన్‌ 16: వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన ఉంగుటూరు సర్పంచి మేదరమెట్ల అనూరాధ భర్త సోమశేఖర్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పరామర్శించి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు, ఎస్సీ కాలనీ మహిళలు గ్రామంలో జరుగుతున్న ఘర్షణలను, వైసీపీ దౌర్జన్యాలను శ్రీధర్‌కు వివరించారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి, నూర్జహాన్‌, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తొలుత 14వ మైలు వద్ద సీఐ రాజేష్‌కుమార్‌ తన సిబ్బందితో శ్రీధర్‌ను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత ఉంగుటూరు వెళ్లేందుకు అనుమతించారు. 


 శ్రీధర్‌ కారును అడ్డుకున్న వైసీపీ నాయకులు

తిరుగు ప్రయాణం అయిన శ్రీధర్‌ను గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని కారుని నిలుపుదల చేశారు. సుమారు అరగంట పాటు నిలువరించారు. సీఐ, సిబ్బంది అక్కడే ఉన్నా వారిని వారించలేదు. మండల టీడీపీ నాయకులు వైసీపీ వారిని అడ్డుకోబోగా శ్రీధర్‌ వారిని వారించారు.  తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు వస్తున్నారనే సమాచారంతో వైసీపీ నాయకులు అక్కడినుంచి తప్పుకున్నారు. ఆయన ఉంగుటూరు చేరుకుని గుంపులుగా ఉన్నవారిని తమ సిబ్బందితో తరిమివేశారు.

Updated Date - 2021-06-17T05:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising